Amitabh Bachchan: తన ఆన్ లైన్ గేమింగ్ పిచ్చి గురించి వివరించిన బిగ్ బి

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలను ఆయన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. బహిరంగ వేదికలపైనా ఆయన సరదాగా మాట్లాడుతుంటారు. 

తాజాగా కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 15లో 75వ ఎపిసోడ్ జరిగింది. ఓ కంటెస్టెంట్ తన ఆన్ లైన్ గేమింగ్ వ్యసనం గురించి అమితాబ్ ఎదుట ప్రస్తావించాడు. ఆ వ్యక్తి తాను గంటలు గంటలు ఆన్ లైన్ చెస్ ఆడుతుంటానని, దాంతో తన భార్య కూడా అసహనం వ్యక్తం చేస్తుంటుందని తెలిపాడు. 

అందుకు అమితాబ్ బదులిస్తూ... తనకు కూడా ఆన్ లైన్ గేమింగ్ అంటే పిచ్చి అని వెల్లడించారు. అయితే చెస్ కాకుండా ఇతర గేమ్స్ ఆడుతుంటానని తెలిపారు. తనకు చెస్ లో ఏమంత ప్రావీణ్యం లేదని అన్నారు. ఆన్ లైన్ గేమ్స్ ను ఎక్కువగా తన మనవరాలు ఆరాధ్యతో ఆడుతుంటానని పేర్కొన్నారు.  తనకు కూడా ఆన్ లైన్ గేమ్స్ ఓ వ్యసనంలా తయారైనట్టు బిగ్ బి వివరించారు.
Amitabh Bachchan
Online Games
Addiction
Kaun Banega Karorepati
Bollywood

More Telugu News