ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో కత్తిపోట్ల ఘటన... తీవ్రస్థాయిలో అల్లర్లు

Riots erupted in Ireland
  • డబ్లిన్ లో ఓ పాఠశాల వద్ద కత్తితో విరుచుకుపడిన దుండగుడు
  • నలుగురికి గాయాలు
  • ఎలాంటి ఉగ్రవాద కోణం లేదంటున్న పోలీసులు
  • తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చిన జనాలు
ఐర్లాండ్ లో కత్తిపోట్ల ఘటన తీవ్ర అల్లర్లకు దారితీసింది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో ఓ పాఠశాల వద్ద ఓ వ్యక్తి కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళకు గాయాలయ్యాయి. ఇందులో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని డబ్లిన్ పోలీసులు చెబుతున్నారు. కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. 

అయితే ఈ కత్తిపోట్ల ఘటన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు ఓ బస్సును, కారును, ట్రామ్ ను అగ్నికి ఆహుతి చేశారు. విధుల్లో ఉన్న ప్రత్యేక పోలీసు బలగాలపై చేతికి అందిన వస్తువులను విసిరారు. 

పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి జాతీయత ఏంటన్నది ఇంకా తెలియరాకపోయినప్పటికీ, అతడు ముస్లిం వ్యక్తి అనే ప్రచారం జరుగుతోంది. ప్రజల ఆగ్రహానికి ఈ అంశమే కారణమన్న వాదనలు  వినిపిస్తున్నాయి. అల్లర్ల నేపథ్యంలో డబ్లిన్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించారు. గర్భవతులు ఆసుపత్రులకు వెళ్లడం తప్పనిసరి అయితేనే బయటికి రావాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Ireland
Riots
Dublin
Knife Attack

More Telugu News