BHU: బెనారస్ హిందూ యూనివర్సిటీలో మళ్లీ అదే ఘటన.. యువతిని లైంగికంగా వేధించిన బస్ డ్రైవర్

  • బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో విధుల నుంచి డ్రైవర్ తొలగింపు  
  • ఈ నెలలో ఇది రెండో ఘటన
  • ఇటీవల ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన ముగ్గురు దుండగులు
Another molestation incident at Banaras Hindu University

వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటిలో పదేపదే అమ్మాయిలపై వేధింపులు జరుగుతున్నాయి. ఈసారి యూనివర్సిటీకి చెందిన ఓ బస్ డ్రైవర్ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. ఆదివారం ఈ ఘటన జరగ్గా బాధితురాలు చీఫ్ ప్రోక్టర్ (ఇన్‌చార్జ్)కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తుకు ఆదేశించిన ఆయన బస్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు. 

అమ్మాయిలపై క్యాంపస్‌లో లైంగిక వేధింపులు జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెలలో ఐఐటీ-బీహెచ్‌యూకు చెందిన అమ్మాయిని ముగ్గురు దుండగులు లైంగిక వేధింపులకు గురిచేశారు. తాజా కేసు విషయానికి వస్తే బాధితురాలు బీకాం విద్యార్థిని. క్యాంపస్ బయట ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 19న డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు.

More Telugu News