తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు... పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఏమన్నారంటే..!
- 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్లు 9.9 లక్షలు ఉన్నట్లు వెల్లడి
- అసెంబ్లీ ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలను సిద్ధం చేశామన్న వికాస్ రాజ్
- 86 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని వెల్లడి
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9వేల మంది ఇంటి నుంచి ఓటు వేసినట్లు చెప్పారు. 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరు నియోజకవర్గాల్లో ఐదు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ సెంటర్కు పరిశీలకుడు ఉంటారన్నారు. తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.