Rahul Dravid: హెడ్ కోచ్ గా కొనసాగింపుకు ఆసక్తి చూపని ద్రావిడ్.. తదుపరి హెడ్ కోచ్ ఎవరు కావచ్చంటే..!

  • వరల్డ్ కప్ తో ముగిసిన ద్రావిడ్ హెడ్ కోచ్ కాంట్రాక్ట్
  • ఆసీస్ తో టీ20 సిరీస్ కు తాత్కాలిక హెడ్ కోచ్ గా లక్ష్మణ్
  • లక్ష్మణ్ పూర్తి స్థాయి హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం
Rahul Dravid not keen on contract extension

వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఊహించని పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఓటమి బాధ నుంచి భారత క్రికెట్ అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోవైపు, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన కాంట్రాక్టు పొడిగింపుకు ఆసక్తిని చూపడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడెమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ పదవిని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. 

వరల్డ్ కప్ ముగియడంతో ద్రావిడ్ హెడ్ కోచ్ పదవీకాలం ముగిసింది. హెడ్ కోచ్ గా ఇక కొనసాగకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ద్రావిడ్ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకుంది. అయితే, ఈ రెండు సందర్భాల్లో కూడా ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈరోజు నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కు లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.

More Telugu News