Chris Gayle: క్రిస్ గేల్ కొడితే బ్యాట్ విరిగిపోయింది.. వీడియో ఇదిగో

Bat broken while chris Gayle batting
షార్ట్స్‌లో చూడండి
44 ఏళ్ల వయసులో కూడా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ సత్తా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడుతున్న గేల్ చెలరేగిపోతున్నాడు. భిల్వారా కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 27 బంతులను ఎదుర్కొన్న గేల్ 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ ఫోర్ కొట్టినప్పుడు బ్యాట్ విరిగిపోయింది. దీంతో గేల్ సహా గ్రౌండ్ లో ఉన్న ఎవ్వరూ నవ్వును ఆపుకోలేకపోయారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భిల్వారా కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది.
Go Back to Shorts
Chris Gayle
West Indies

More Telugu News