ed: మాజీ ఎంపీ వివేక్, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ ప్రకటన

ED statement on searches in Vivek house and offices
షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన సోదాలపై బుధవారం ఈడీ ప్రకటన చేసింది. రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు వచ్చినట్లు ఈడీ తెలిపింది. పోలీసుల ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ సెక్యూరిటీస్ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. వ్యాపారం ద్వారా రూ.20 లక్షల ఆదాయమే వచ్చిందని, ఆస్తులు, అప్పులతో కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్ షీట్ ఉందని తెలిపింది.

లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించినట్లు పేర్కొంది. కంపెనీలను వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారని, ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది. మరోవైపు ఎంఎస్ సెక్యూరిటీస్ సంస్థకు యశ్వంత్ రియాల్టర్స్ మాతృ సంస్థ అని, ఇందులో విదేశీ షేర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. వివేక్ ఫెమా నిబంధనలకు ఉల్లంఘించి విదేశంలో సంస్థను ఏర్పాటు చేశారన్నారు.
Go Back to Shorts
ed
vivek
BRS
Congress

More Telugu News