మోదీ మ్యాచ్ చూడ్డం వల్లే భారత్ ఓడిందన్న రాహుల్‌గాంధీ
- భారత జట్టు గెలిచే మ్యాచ్‌ను ఓడిందన్న రాహుల్
- ఓ చెడు శకునం స్టేడియంలో మ్యాచ్ చూడ్డం వల్లేనని తీవ్ర విమర్శ
- రాహుల్ మతి స్థిమితం కోల్పోయారన్న బీజేపీ
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన జట్టు గెలిచేదేనని, అయితే ఓ చెడు శకనం మ్యాచ్‌కు రావడం వల్ల మనోళ్లు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, ఖండించదగినవని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మానసిక అస్థిరతకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.