ఖమ్మం ఎన్నికపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి: తుమ్మల నాగేశ్వరరావు

  • తనకు, రేణుకకు రాజకీయ జన్మను ఇచ్చింది ఎన్టీఆరే అన్న తుమ్మల
  • ఖమ్మంలో బీఆర్ఎస్ అరాచకాలు పెరిగిపోయాయని మండిపాటు
  • గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని వ్యాఖ్య
తనకు, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి రాజకీయ జన్మను ఇచ్చింది దివంగత ఎన్టీఆరే అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ ఆశీస్సులతోనే తాము ఇంతకాలం ప్రజా జీవితంలో ఉన్నామని చెప్పారు. తనను మొదటి సారే వెంగళరావు కుటుంబంపై ఎన్టీఆర్ నిలబెట్టారని తెలిపారు. కురవి మండలం బలపాల గ్రామస్థులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన రాజకీయ జీవితంలో బలపాల గ్రామస్థులు ఎప్పుడూ అండగా ఉన్నారని చెప్పారు. 

వామపక్ష యోధులు ఉన్న జిల్లాలో ఇంతకాలం గౌరవప్రదమైన రాజకీయాలు చేశానని తుమ్మల చెప్పారు. ప్రజాభిమానం కారణంగానే 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని... ఈ అరాచకాలపై ఓటర్లు ఈవీఎంలపై బటన్లను నొక్కి తీర్పును ఇవ్వాలని తుమ్మల కోరారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఖమ్మం ఎన్నికపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయని అన్నారు.

Thummala
Renuka Chowdary
Telugudesam
NTR
Khammam District

More Telugu News