కేటీఆర్ ప్రచార తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ
- ప్రభుత్వ భవనాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు
- తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపణలు
- మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం ఉల్లంఘనే అన్న కాంగ్రెస్
ప్రభుత్వ భవనమైన టీ హబ్‌లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీ హబ్‌లో సమావేశంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన కాంగ్రెస్ బృందం పేర్కొంది.