నేను ఆరోగ్యంగానే ఉన్నాను... సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది: సందీప్ శాండిల్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ఆరోగ్యంగానే ఉన్నాను... సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది: సందీప్ శాండిల్య

Sandeep Sandilya releases video about his health
  • మధ్యాహ్నం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరిన నగర సీపీ సందీప్ శాండిల్య
  • తల తిరగడంతో ఆసుపత్రిలో చేరానని వీడియో విడుదల
  • రేపు యథావిధిగా విధులకు హాజరవుతానని స్పష్టీకరణ
తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. మధ్యాహ్నం కార్యాలయంలో ఉండగా ఆయన అస్వస్థతకు గురికావడంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వీడియోను విడుదల చేశారు. తల తిరగడంతో తాను ఆసుపత్రిలో చేరానని, లోబీపీ, స్పాండిలైటిస్ వల్ల అలా జరిగిందని నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని తనకు వైద్యులు సూచించినట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలు అవాస్తవమని, తాను రేపు విధులకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
Advertisement
sandeep sandilya
Hyderabad
hospital

More Telugu News