తెలంగాణ చరిత్రలో మొదటిసారి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తాం: జేపీ నడ్డా
- దళితబంధులో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు
- మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం రూ.5 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసిందన్న నడ్డా
- ఉజ్వల వినియోగదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితమని ప్రకటన
బీఆర్ఎస్ ఈ తొమ్మిదేళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చింది? అని ప్రశ్నించారు. నరేంద్రమోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. బీజేపీని గెలిపిస్తే వరికి మద్దతు ధరను రూ.3100కు పెంచుతామన్నారు. ఎరువుల కోసం రూ.2100 ఇన్‌పుట్ సబ్సిడీని అందిస్తామన్నారు. మహిళా సంఘాలకు ఒక శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.