టీడీపీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా: తుమ్మల నాగేశ్వరరావు

  • తనకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆరే అన్న తుమ్మల
  • ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నానని వెల్లడి
  • ఖమ్మం, పాలేరుపైనే కేసీఆర్ దృష్టి సారించారని విమర్శ
రాజకీయంగా తనకు జన్మనిచ్చింది దివంగత ఎన్టీఆర్ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చిన్న వయసులోనే తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని... అయినప్పటికీ తాను టీడీపీలోనే కొనసాగానని చెప్పారు. పదవుల కోసం తాను ఆశపడనని... ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. తనకు టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలిచాయని... వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

బీఆర్ఎస్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అయినా ఆ పార్టీ తనను ఓడించిందని... అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తుమ్మల చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెట్టేశారని... ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను ఓడించడంపై దృష్టి సారించారని విమర్శించారు. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Thummala
Congress
KCR
BRS
Telugudesam
NTR

More Telugu News