ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేను: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
- గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్లు రాకాడన్న ఈటల రాజేందర్
- ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని... అందుకే రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలోలేనని వ్యాఖ్య
- నా ధైర్యం, శక్తి అంతా హుజూరాబాద్ ప్రజలేనన్న ఈటల రాజేందర్
డబ్బులు ఉంటేనే రాజకీయం చేయడం కాదని, డబ్బులు లేకపోయినా నేను రాజకీయం చేస్తున్నానన్నారు. ఇతర పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలు, రూ.3 వేలు ఇస్తే తీసుకోవాలని, కానీ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా శక్తి, ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అన్నారు. కానీ ప్రస్తుతం డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో తాను లేనన్నారు.