నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!
- బజార్ ఘాట్ లోని ఓ గోడౌన్ లో ఎగసిపడ్డ మంటలు
- ఐదు అంతస్తులకు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న కార్మికులు
- నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది
గోడౌన్ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్ లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిప్పంటుకుందని వివరించారు.