Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి దంపతులు.. వీడియో ఇదిగో!

Revanth Reddy in Tirumala with family
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామంలో స్వామి పూజలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నాక రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి ఆలయ పండితులు వేద ఆశీర్వాదం అందించారు. స్వామి వారి పట్టువస్త్రంతో పాటు తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్థిక, రాజకీయ బంధాలు బాగుండాలని ప్రార్థించినట్లు వివరించారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.
Go Back to Shorts
Revanth Reddy
Tiumala
Congress
TPCC President

More Telugu News