చంద్రమోహన్ మృతిపై నారా లోకేశ్ సంతాపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రమోహన్ మృతిపై నారా లోకేశ్ సంతాపం

Nara lokesh extends condolences over Chandramohan passing away
  • చంద్రమోహన్ మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించిన నారా లోకేశ్
  • విభిన్న పాత్రలు అలవోకగా పోషించి, మెప్పించారని ప్రశంస
  • చంద్రమోహన్ కుటుంబసభ్యులకు సంతాపం
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ అని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 

కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ ఈ రోజు ఉదయం 8.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. తన కెరీర్‌లో ఆయన 939 సినిమాల్లో నటించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Advertisement
Nara Lokesh
Chandramohan

More Telugu News