హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో ఉంటారు: రేవంత్‌రెడ్డి
- బీఆర్ఎస్లో ఉంటేనే ఉద్యమకారుడు..లేదంటే ద్రోహి అని ముద్ర వేస్తున్నారని రేవంత్ ఆగ్రహం
- ‘ధరణి’పై మరోమారు ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్
- అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ‘ధరణి’ పనిచేస్తోందని ఆరోపణ
- తాను సీఎంను అవుతానని హరీశ్‌రావు చెప్పగలరా?అని ప్రశ్న
బీఆర్ఎస్లో ఉంటేనే ఉద్యమకారుడు.. లేదంటే తెలంగాణ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమకారులకు సీట్లు ఇస్తే.. వేలకోట్లు ఉన్న వారికి బీఆర్ఎస్ రాజ్యసభ సీట్లు ఇచ్చిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తాము 60 శాతం సీట్లు ఇచ్చామన్నారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ప్రచారం చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ధరణి’పై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్.. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వాటిని వారికి ఇచ్చే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని కొందరు ధరణి వచ్చాక వందల ఎకరాలకు ఆసాములయ్యారని తెలిపారు. ఊళ్లలోని భూములను ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లు ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయని రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.