Jagan: రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

Jagan tour in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయల్దేరుతారు. 

అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP

More Telugu News