చివరి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
- ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితా విడుదల
- రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి సూర్యాపేట
- ముజీబుల్లాకు చార్మినార్ టికెట్ కేటాయింపు
- నిన్నటి వరకు మొత్తం 2,265 నామినేషన్ల దాఖలు
నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థులు తమ పత్రాలతో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. 13వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా, 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 30న పోలింగ్ జరుగనుండగా డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. నిన్న ఒక్కరోజే 1077 నామినేషన్ల దాఖలు కాగా, ఇప్పటి వరకు మొత్తం 2,265 నామినేషన్లు వచ్చాయి.