పోలవరం కుడి కాలువ వద్ద అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ... పలు వాహనాలను పట్టుకున్న చింతమనేని
- పెదవేగి మండలంలో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారన్న చింతమనేని
- ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించలేదంటూ స్వయంగా రంగంలోకి దిగిన టీడీపీ నేత
- తాను పట్టుకున్న వాహనాలతో సహా పీఎస్ ముందు బైఠాయింపు
- గత అర్ధరాత్రి నుంచి పీఎస్ ఎదుట చింతమనేని నిరసన
గత అర్ధరాత్రి వేళ పోలవరం కుడి కాలువ వద్ద పలు వాహనాలను పట్టుకున్నారు. చింతమనేని 10 లారీలను, 2 జేసీబీలను, 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. తాను పట్టుకున్న వాహనాలతో సహా పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు కదలబోనని చింతమనేని నిరసనకు దిగారు. గత అర్ధరాత్రి నుంచి ఆయన పోలీస్ స్టేషన్ వద్దే నిరసన తెలుపుతున్నారు.