టేక్ కేర్ రామన్నా...: కేటీఆర్ వాహనంపై నుంచి కిందపడిన ఘటనపై సోదరి కవిత
- కేటీఆర్‌తో మాట్లాడినట్లు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
- వీడియో చూస్తే భయానకంగా ఉందన్న బీఆర్ఎస్ నాయకురాలు
- కేటీఆర్ ఎప్పటిలాగే రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం కొనసాగిస్తాడని వ్యాఖ్య
కాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఎన్నికల ప్రచార వాహనం రెయిలింగ్ కూలి బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి జీవన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి తదితరులు వాహనం పైనుంచి కిందపడ్డారు. దీంతో కేటీఆర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.