వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ తుది విడత టికెట్ల విక్రయం నేడే
- తుది అంకానికి చేరుకున్న వరల్డ్ కప్ లీగ్ దశ
- నవంబరు 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు
- నవంబరు 19న ఫైనల్
- ఈ విడతతో టికెట్ల అమ్మకాలు పూర్తి
ఈ మెగా టోర్నీలో నవంబరు 15న తొలి సెమీఫైనల్, నవంబరు 16న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్ ల కోసం తుది విడత టికెట్లను నేడు విక్రయించనున్నారు.
రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ కోసం ఇవాళ రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి వస్తాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. అధికారిక వెబ్ సైట్ https://tickets.cricketworldcup.com. ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. వరల్డ్ కప్ టోర్నీని ప్రత్యక్షంగా స్టేడియంలకు వెళ్లి చూడాలనుకునే అభిమానులకు ఇదే చివరి అవకాశం. దీంతో టికెట్ల అమ్మకాలు పూర్తవుతాయని బీసీసీఐ పేర్కొంది.