ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట... అప్పటివరకు అరెస్ట్ చేయొద్దన్న సుప్రీంకోర్టు

  • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
  • ఈ నెల 30వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.

Chandrababu
Telugudesam
AP Fibergrid Case
Bail
Supreme Court

More Telugu News