మైనంపల్లి పైసల మైనాన్ని ఓటుతో కరిగించాలి: మంత్రి హరీశ్ రావు
- మైనంపల్లి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం
- తాను ఆయనలా దిగజారి మాట్లాడలేనన్న హరీశ్ రావు
- మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్య
మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించారన్నారు. కానీ కేసీఆర్ పాలనలో హైదరాబాద్ సహా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. హైదరాబాద్ ఇలాగే ప్రశాంతంగా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.