ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్స్ నిషేధం!
- పరిసరాల్లో చెత్తాచెదారం పడేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక
- నోటీసు బోర్డు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
- ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని స్పందించిన జీహెచ్ఎంసీ
కాగా యువత ట్యాంక్ బండ్‌పై బర్త్ డే వేడుకలతో హంగామా చేస్తున్నారు. అక్కడి పరిసరాలను అపరిశుభ్రంగా మార్చడంతోపాటు అటుగా వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీటిపై పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎట్టకేలకు స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్‌బండ్‌పై నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.