‘టీ’ తీసుకురాలేదని సర్జరీని మధ్యలోనే ఆపేసిన డాక్టర్!
- ట్యూబెక్టమి సర్జరీ చేయకుండా ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయిన వైద్యుడు
- నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చిన ఘటన
- విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్న జిల్లా అధికారులు
బాధిత మహిళల కుటుంబ సభ్యులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందిత వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆస్పత్రికి మరో వైద్యుడిని పిలిపించినట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ నిర్లక్ష్యపూరిత ఘటనపై నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్యశర్మ స్పందించారు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.