సొంత పార్టీ కార్యకర్తలపైనా వైసీపీ నేతల దాష్టీకం.. జగన్ పాలనలో మహిళలకు రక్షణేది?: నారా లోకేశ్
- వాలంటీర్ పై ఎంపీటీసీ అత్యాచారయత్నం ఘటనపై లోకేశ్ మండిపాటు
- బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు
- వాలంటీర్ వీడియోను షేర్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నిందితుడికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, ఆయనే వెనకుండి ఇదంతా చేయిస్తున్నాడని బాధితురాలు చెబుతోందన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నా పోలీసులు స్పందించడంలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. జగన్ పాలనలో అధికార పార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదని నారా లోకేశ్ పేర్కొన్నారు.