గుజరాత్ లో ఒకే రోజు ఇద్దరు మాజీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదాలు
- గుజరాత్‌కు సీఎంలుగా పనిచేసిన విజయ్ రూపానీ, సురేశ్ మెహతా
- గుజరాత్‌లో వేర్వేరు చోట్ల ప్రమాదాలు
- ఓ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు
గుజరాత్‌లోనే జరిగిన మరో ప్రమాదం నుంచి మాజీ సీఎం సురేశ్ మెహతా కొద్దిలో తప్పించుకున్నారు. మోర్బీ జిల్లా హల్వద్ పట్టణ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఓ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. కారును చూసి ట్రక్కు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, వేగం తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం మెహతా మరో కారులో వెళ్లినట్టు పేర్కొన్నారు.