తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్
- గత జూన్ లో రక్షితారెడ్డిని పెళ్లాడిన శర్వానంద్
- ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రక్షిత
- భార్యకు తోడుగా ఉండేందుకు అమెరికాకు వెళ్లిన శర్వా
మరోవైపు రక్షిత ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అక్కడే రెగ్యులర్ గా చెకప్ లు కూడా చేయించుకుంటున్నారు. భార్యకు తోడుగా ఉండేందుకు శర్వా అమెరికాకు వెళ్లినట్టు చెపుతున్నారు. డెలివరీ తర్వాతే మళ్లీ హైదరాబాద్ కు రానున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై ఇంత వరకు శర్వానంద్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించలేదు. సినిమాల విషయానికి వస్తే శర్వానంద్ 35వ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో శర్వా సరసన కృతిశెట్టి నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో... ఇతర సినిమాలకు చిన్ని బ్రేక్ ఇచ్చి ఆయన అమెరికాకు వెళ్లిపోయాడు.