మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య
- తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం
- హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఘటన
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి సబితా
సమాచారం అందుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ చేసుకోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మరోవైపు వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు ఆరా తీశారు. ఫాజిల్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.అయితే ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడితో మాట్లాడిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.