కోహ్లీ అత్యధిక వన్డే సెంచరీ రికార్డు కొద్దిలో మిస్.. సచిన్ స్పందన ఇదీ!
- తన కెరీర్‌లో 49 వన్డే సెంచరీలు చేసిన సచిన్
- 48 వన్డే సెంచరీలతో సచిన్ రికార్డుకు చేరువగా కోహ్లీ
- శ్రీలంకతో మ్యాచ్‌లో సచిన్ రికార్డును సమం చేసే అవకాశం త్రుటిలో మిస్
- తన రికార్డులు భారతీయ క్రీడాకారులే అధిగమించాలని సచిన్ వ్యాఖ్య
కాగా, కోహ్లీ రికార్డు మిస్సవడంపై స్పందించిన సచిన్ తన రికార్డును సమం చేసే అవకాశం మరో భారతీయుడి ముందు ఉండటంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘‘అది నా రికార్డు కాదు..భారత్ రికార్డు. కాబట్టి, ఇది భారత్ వద్దే ఉన్నంతవరకూ నాకు సంతోషమే’’ అని కామెంట్ చేశాడు. అయితే, శ్రీలంక మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డును అధగమించాడు. ఏకంగా ఎనిమిది క్యాలెండర్ సంవత్సరాల్లో జరిగిన వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసి సచిన్‌ను అధిగమించాడు. సచిన్ తన కెరీర్‌లో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో వెయ్యికిపైగా పరుగులు చేసిన విషయం తెలిసిందే.