నేపాల్‌లో భూకంపం.. 128 మందికి పైగా మృతి
- జార్కోట్ జిల్లాలోని లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
- కూలిన భవనాలు, శిథిలాల కింద చిక్కి 60 మంది మృతి
- సహాయక చర్యలు ప్రారంభించిన నేపాల్ ప్రభుత్వం
- నష్ట తీవ్రతను ఇప్పుడే చెప్పలేమన్న స్థానిక అధికారులు
భూకంపం రాత్రి వేళ సంభవించడంతో జరిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని నేపాల్ అధికారులు తెలిపారు. ఘటనపై వెంటనే స్పందించిన నేపాల్ ప్రభుత్వం అత్యవసర, విపత్తు నిర్వహణ సిబ్బంది, భద్రతా దళాలను రంగంలోకి దింపింది. భారత భూఫలకం, యూరేసియా ఫలకం కలిసే ప్రదేశంలో నేపాల్ ఉండటంతో ఇక్కడ భూకంపాలు నిత్యం సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.