బీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి... కానీ!: ఈటల రాజేందర్ సూచన

  • మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ మాయమాటలు చెబుతోందన్న ఈటల
  • కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పేదలకు అన్యాయం చేసిందని మండిపాటు
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదల భూములు వారికే ఇస్తామని హామీ
మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార బీఆర్ఎస్ ఎన్నో మాయమాటలు చెబుతోందని, అలాంటి వారిని నమ్మి మరోసారి మోసపోవద్దని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కేసీఆర్ నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదలకు ఎలా అన్యాయం చేసిందో తెలిసిందే అన్నారు. పేదల భూములను తీసుకొని ప్రయివేటు కంపెనీలకు అప్పనంగా ఇచ్చిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అలా లాక్కున్న భూములను తిరిగి వారికే అప్పగిస్తామన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఏం ఇచ్చినా తీసుకోవాలని, కానీ మీ ఓటును మాత్రం న్యాయానికి, ధర్మానికి వేయాలని కోరారు.

Etela Rajender
BRS
BJP
Telangana Assembly Election

More Telugu News