ప్రముఖ సినీ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూత.. ఆలస్యంగా వెలుగు చూసిన మృతి వార్త
- అమెరికాలో ఉన్న కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వర్ రావు
- అక్టోబర్ 31న మృతి
- 'స్వర్గం నరకం' సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈశ్వర్ రావు
'స్వర్గం నరకం' సినిమా ద్వారా సినీ పరిశ్రమకు ఈశ్వర్ రావు పరిచయం అయ్యారు. ఇదే సినిమాతోనే మోహన్ బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.