ఆటకు ముందు బిర్యానీలు, కబాబ్‌లు లాగించేసి.. బాగా తింటున్నారని విమర్శించినవారి నోళ్లు మూయించిన పాకిస్థాన్ జట్టు!
- కోల్ కతాలోని జూమ్ జూమ్ రెస్టారెంట్ కు ఆర్డర్
- బిర్యానీలు, కబాబ్‌లు, చాప్‌లు తెప్పించుకొని తిన్న ఆటగాళ్లు
- ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత ఆర్డర్ చేశారన్న రెస్టారెంట్ డైరెక్టర్
విమర్శలను పక్కనపెట్టి కోల్‌కతాలో మ్యాచ్‌కు ఒక రోజు ముందు బిర్యానీలు, కబాబ్‌లు, చాప్‌లను తెప్పించుకుని పాక్ ఆటగాళ్లు ఆరగించారు. ఆహారానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోల్‌కతాలో జామ్ జామ్ రెస్టారెంట్ నుంచి ఈ ఆహారాన్ని తెప్పించుకుని తిన్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్‌తోపాటు ఇతర ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం ఈ ఫుడ్‌ని లాగించారు. జూమ్ జూమ్ రెస్టారెంట్ డైరెక్టర్ షాద్‌మాన్ ఫైజ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆర్డర్ వచ్చిందని, ఈ ఆర్డర్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి వచ్చిందని తమకు తర్వాత తెలిసిందని చెప్పారు. బిర్యానీ, కబాబ్‌లు, చాప్ అనే మూడు రకాల వంటకాలను ఆర్డర్ చేశారని వెల్లడించారు. ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత ఆర్డర్ చేశారని, ఫుడ్ వాళ్లకు నచ్చే ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.
కాగా బంగ్లాదేశ్‌పై ఘనవిజయం ద్వారా ఆహారంతో ముడిపెట్టిన విమర్శించినవారి నోళ్లను పాక్ ఆటగాళ్లు మూయించినట్టయ్యింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించడంతో ఆటగాళ్లు సెమీస్ అవకాశాలను ఇంకా సజీవంగానే ఉంచుకున్నారు.