వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీల కాక్ టెయిల్ పార్టీలో మెగా ఫ్యామిలీ సందడి.. ఫొటోలు ఇవిగో!

  • రేపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల వివాహం
  • కాక్ టెయిల్ పార్టీతో కిక్ స్టార్ట్ అయిన వివాహ వేడుక
  • ఈరోజు హల్దీ ఫంక్షన్, మెహందీ వేడుక
టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి రేపు ఇటలీలో జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరుకుంది. వీరితో పాటు అతి కొద్ది మంది మిత్రులు కూడా ఇటలీకి వెళ్లారు. కాక్ టెయిల్ పార్టీతో వివాహ వేడుక కిక్ స్టార్ట్ అయింది. ఈరోజు 11 గంటలకు హల్దీ ఫంక్షన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూల్ పార్టీ జరుగుతుంది. సాయంత్రం 5.30 గంటలకు మెహందీ వేడుక ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2.48 గంటలకు పెళ్లి ముహూర్తం. రేపు రాత్రి 8.30 గంటలకు వెడ్డింగ్ రిసెప్షన్ ను నిర్వహించనున్నారు. పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠీ కుటుంబం, స్నేహితులు కలిపి మొత్తం 120 మంది ఇటలీకి వెళ్లారు. 

Mega Family
Varun Tej
Lavanya Tripathi
Cocktail Party

More Telugu News