మొన్న మిచెల్.. నిన్న బట్లర్.. కుల్దీప్ మ్యాజిక్ బంతికి బిత్తరపోయిన ఇంగ్లండ్ స్కిప్పర్.. వీడియో ఇదిగో!

  • లక్నోలో గతరాత్రి ఇంగ్లండ్‌తో మ్యాచ్
  • కుల్దీప్ బంతిని అంచనా వేయడంలో బట్లర్ విఫలం
  • మిడిల్ స్టంప్‌ను గిరాటేసిన బంతి
ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోమారు అద్భుత ప్రదర్శన చేశాడు. ధర్మశాలలో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాజిక్ బంతితో డరిల్ మిచెల్‌ను కన్ఫ్యూజ్ చేసిన కుల్దీప్.. ఇంగ్లండ్‌ బ్యాటర్ బట్లర్‌ను కూడా బోల్తా కొట్టించాడు. బంతి స్వింగ్‌ను అర్థం చేసుకోలేని బట్లర్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.

16వ ఓవర్‌ తొలి బంతికే ఈ ఘటన జరిగింది. అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌లో పిచ్ అయిన బంతి ఒక్కసారిగా టర్న్ అయి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. బంతిని అంచనా వేయడంలో విఫలమైన బట్లర్ అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. అనూహ్యంగా టర్న్ అయిన బంతి వికెట్లను పడగొట్టడంతో బట్లర్ షాకయ్యాడు. కాసేపటి వరకు కోలుకోలేకపోయాడు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. కుల్దీప్‌ ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు ఆ బంతిని ‘బాల్ ఆఫ్ ద వన్డే ప్రపంచకప్’ అని కొనియాడుతున్నారు.

Kuldeep Yadav
Jos Buttler
Kuldeep Magic Bowl
World Cup 2023

More Telugu News