చిరంజీవికి చాలా పెద్ద అభిమానిని.. కల్వకుంట్ల కవిత
- ఒకసారి అభిమాని అయితే ఎప్పటికీ అభిమానేనని వెల్లడి
- ఆ తర్వాత బన్నీ నటన అంటే ఇష్టమన్న ఎమ్మెల్సీ
- ‘ఆస్క్ కవిత’ అంటూ నెటిజన్ల ప్రశ్నలకు జవాబిచ్చిన బీఆర్ఎస్ నేత
ఎమ్మెల్సీ కవిత జవాబుతో చిరంజీవి, అల్లు అర్జున్ చాలా ఆనందపడుతున్నారు. చిరు, బన్నీ ఫొటోలను కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఓ టీవీ ఛానెల్ ఇంటర్వూలో కవిత మాట్లాడుతూ.. మీ అభిమాన హీరో ఎవరన్న యాంకర్ ప్రశ్నకు చిరంజీవి అని చెప్పారు. ఇప్పటికీ ఆయనే మీ ఫేవరేట్ హీరోనా అని యాంకర్ మరో ప్రశ్న సంధించగా.. ఒకసారి అభిమాని అయితే అంతే.. ఇక ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోతామని కవిత తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్ గా మారింది.