ఎవరైనా కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి హెచ్చరిక
- కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని విమర్శ
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ అజ్ఞాని అని విమర్శ
- బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను కంట్రోల్ చేసేది మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ అన్న కిషన్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను కంట్రోల్ చేసేది మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని ఆరోపించారు. తెలంగాణ ఒక మాఫియా చేతిలో బందీగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు బీజేపీ విముక్తి చేస్తుందన్నారు. బీజేపీపై ఎవరైనా కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.