India: ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయంతో కనుమరుగు కానున్న ఇండియా అనే పదం!

NCERT takes key decision to remove word India from books
  • ఇండియా అనే పదం వాడకూడదంటూ ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం
  • ఇకపై భారత్ అనే పదాన్నే వాడాలని మార్గదర్శకాల జారీ
  • ఇప్పటికే ఇండియా బదులుగా భారత్ అనే పదాన్ని వాడుతున్న కేంద్ర ప్రభుత్వం
ఇండియా అనే పదాన్ని ఇకపై పాఠ్య పుస్తకాల్లో వాడకూడదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా అంటే భారత్ యూనియన్ అని... ఇకపై ఇండియా బదులు భారత్ అనే పదాన్నే వాడాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఎన్సీఈఆర్టీ ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత్ అనే పేరును మాత్రమే వాడాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఇకపై పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదం మాయం కానుంది. కొత్త పుస్తకాల్లో ఇకపై భారత్ అని మాత్రమే ఉండబోతోంది. 

దేశంలోని విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం తన కార్యక్రమాల్లో దాదాపుగా ఇండియా అనే పదాన్ని వాడటం లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని నేమ్ ప్లేట్లపై పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్సీఈర్టీ తీసుకున్న నిర్ణయంపై ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
India
Bharat
NCERT

More Telugu News