విద్య‌లో గాలిలో మేడ‌లు వ‌ద్దు గ‌ట్టి పునాదే ముద్దు... అక్కడి నుంచే లోకేశ్ సంస్కరణలు

Nara Lokesh Focuses on Strong Education Foundation Not Just Fancy Buildings
  • పాఠ‌శాల విద్య‌లో స‌మ‌స్య‌లు గుర్తింపు.. సంస్క‌ర‌ణ‌ల అమ‌లు 
  • పునాది ద‌శ అభ్య‌స‌నాలు మెరుగుప‌రిచేందుకు ప్ర‌ణాళిక‌లు అమ‌లు 
  • జీ-ఎఫ్ఎల్‌ఎన్, టీఏఆర్ఎల్‌తో ప్రాథ‌మిక విద్య‌లోనే బ‌ల‌మైన పునాది 
  • ఫ్యాన్సీ విద్యా విధానాల జోలికి వెళ్ల‌ని మంత్రి లోకేశ్
గాలిలో మేడ‌లు క‌ట్టొద్దు అని హిత‌వు చెప్పే పెద్ద‌లు నేల‌పై నిల‌బ‌డ‌మంటారు. స‌వాళ్ల‌తో కూడిన విద్యాశాఖ‌ను చేప‌ట్టిన నారా లోకేశ్ గాలిలో మేడ‌లు క‌ట్టే యంత్రాంగానికి అస‌లు మ‌న విద్య ఎక్క‌డుందో చూడండంటూ ఆదేశాలిచ్చారు. విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, విదేశాల్లోనే వ‌ర‌ల్డ్ బ్యాంకులో ఉన్న‌త ఉద్యోగం చేసిన లోకేశ్ విద్యాశాఖ‌లో ఫ్యాన్సీ విదేశీ విద్యావిధానాలు అమ‌లు చేయాల‌ని య‌త్నించ‌లేదు. గ‌త పాల‌కుల మాదిరిగా టోఫెల్, ఐబీ అంటూ నేల విడిచి సాము చేయ‌లేదు. నేష‌న‌ల్ అచీవ్ మెంట్ స‌ర్వే,  యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ నివేదిక‌ల మేర‌కు క‌నీస అభ్య‌స‌నా సామ‌ర్థ్యాలు విద్యార్థుల్లో లేవ‌ని గుర్తించారు. ఇవి పెంపొందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు.

దేశంలోనే తొలిసారిగా .గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్

భార‌త‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా 38391 ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో గ్యారెంటీడ్ ఫౌండేష‌న్ లిట‌ర‌సీ న్యూమ‌ర‌సీ (జీ-ఎఫ్ఎల్ఎన్) అమ‌లు ఆరంభించారు. ప్రతీ విద్యార్థికి బలమైన పునాది అభ్యసనాలు ఒత్తిడితో కాదు, ఉల్లాసంతో, ఆటపాటలతో మొదలవ్వాలి. అందుకే మన ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థుల కోసం గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీ-ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని అమలు చేస్తుంది.

మన ప్రాథమిక పాఠశాలల్లోకి అడుగుపెడితే, విద్యార్థులు పుస్తకాల్లోని అంశాలను బట్టీ పట్టడం కాకుండా, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎడ్యుటైన్‌మెంట్ యాక్టివిటీస్ వంటి, బాలా ఫీచర్స్ వంటి బోధన ద్వారా ఎంతో సరదాగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ నేర్పుతున్నారు. చిత్రాల ద్వారా అక్షరాలు నేర్చుకోవడం, ఆటల ద్వారా అంకెలు లెక్కించడం వంటి పద్ధతుల ద్వారా తెలుగు, ఇంగ్లీష్ భాషల‌ను బోధిస్తున్నారు.

జ్ఞానజ్యోతి, జ్ఞానప్రకాశ్ వంటి మాడ్యూల్స్ ద్వారా ప్రతి అక్షరాన్ని, ప్రతి శబ్దాన్ని అనుభూతి చెందుతూ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. పెద్ద తరగతులకు వెళ్ళే వరకు వేచిచూడకుండా, మొదటి నుండే పునాదిని బలంగా నిర్మించడం గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రత్యేకత. విద్యార్థుల అభ్య‌స‌నా సామ‌ర్థ్యాల‌కు అనుగుణంగా, వారి స్థాయిని అంచ‌నా వేసి త‌ద‌నుగుణంగా పాఠ్య ప్ర‌ణాళిక సిద్ధంచేశారు. రెగ్యుల‌ర్ క్లాసులు పూర్త‌యిన త‌రువాత మ‌ధ్యాహ్నం 1 గంట నుంచీ 3.30 వ‌ర‌కూ రెమెడియ‌ల్ సెష‌న్స్ కొన‌సాగిస్తున్నారు.

సులభతర బోధనకు, బోధనాభ్యసన సామగ్రి పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్యారెంటీడ్ ఎఫ్.ఎల్.ఎన్. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్ర శిక్ష పాఠశాలలకు, విద్యార్థులకు వివిధ రకాల బోధనా సామగ్రిని (టీఎల్ఎస్) అందజేశాయి. 2025-26 విద్యా సంవత్సరంలో సరఫరా చేసిన వస్తువుల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

అభ్యాస కిట్లు (లర్నింగ్ కిట్స్)

1. జాదూయ్ పిటారా: ఇది ఆటల ద్వారా నేర్చుకోవడానికి రూపొందించిన ఒక మ్యాజిక్ బాక్స్ వంటి కిట్. ఇందులో ఆటబొమ్మలు, పజిల్స్, ఫ్లాష్ కార్డ్‌లు, కృత్యాధార బోధన కోసం అవసరమైన 62 వస్తువులు ఉంటాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,000 పాఠశాలలకు అందించబడింది.

2. ఎఫ్.ఎల్.ఎన్ లెర్నింగ్ కిట్లు: స్కూల్ కాంప్లెక్స్ ద్వారా మిగిలిన 26391 పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రాథమిక విద్యార్థుల్లో భాషా, గణిత సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి.

3. ఎఫ్.ఎల్.ఎన్ ప్రింట్ రీచ్ మెటీరియల్: పాఠశాలల్లోని తరగతి గదులను అభ్యసన కేంద్రాలుగా మార్చడంలో ప్రింట్ రీచ్ మెటీరియల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది విద్యార్థులు తమ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా సహజంగా భాషను, అక్షరాలను నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఎఫ్.ఎల్.ఎన్ అమలులో భాగంగా వర్ణమాల, గుణింతాలు, సంఖ్యలు, కీలక పదాల చార్టులు, నిత్యం కొత్త పదాలను ప్రదర్శించే వర్డ్ వాల్, బొమ్మల కథల పుస్తకాలు, ఫ్లాష్ కార్డ్స్ కలిగిన రీడింగ్ కార్నర్స్, తరగతి గదిలోని వస్తువులకు బైలింగువల్ లేబులింగ్, విద్యార్థుల సృజనాత్మకతను చాటే వర్క్ డిస్ ప్లే, బొమ్మలతో కూడిన సూచన బోర్డులను ప్రభుత్వం అందించింది. ఈ మెటీరియల్ ద్వారా విద్యార్థులు ఖాళీ సమయంలో కూడా నిరంతరం నేర్చుకుంటూ, చదువు పట్ల భయాన్ని వీడి పఠనాసక్తిని పెంపొందించుకుంటారు.

4. బీఏఎల్ఎ ఫీచర్లు: పాఠశాల భవనాన్ని కేవలం నాలుగు గోడల నిర్మాణంగా కాకుండా, ఒక సజీవ బోధనా సాధనంగా మార్చడమే బీఏఎల్ఏ యొక్క అసలు ఉద్దేశం. ఈ విధానం విద్యార్థుల విభిన్న అభ్యసన శైలులకు అనుగుణంగా ఉంటూ, చూసి నేర్చుకునే వారికి ఆకర్షణీయమైన చిత్రాలను, చేసి నేర్చుకునే వారికి నేలపై ఇంటరాక్టివ్ ఆటలను అందిస్తుంది. దీనివల్ల నెమ్మదిగా నేర్చుకునే పిల్లలు సైతం ఎలాంటి ఒత్తిడి లేకుండా విషయాలను సులభంగా అవగాహన చేసుకుంటారు. గోడలపై ఉండే సైన్స్ రేఖాచిత్రాలు లేదా స్థానిక మ్యాపులు పిల్లల్లో చక్కని జిజ్ఞాసను రేకెత్తించి, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా స్వతంత్రంగా ఆలోచించేలా ప్రేరేపిస్తాయి. చదువును నిజ జీవితంతో, స్థానిక సంస్కృతితో అనుసంధానించడం ద్వారా అభ్యసనం మరింత అర్థవంతంగా మారుతుంది.

5. చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నిచర్: కొన్ని ఎంపిక చేసిన పాఠశాలలకు విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చుని కృత్యాలు చేయడానికి అనువైన ఫర్నిచర్ ఇచ్చారు.

6. అవుట్ డోర్ ప్లే మెటీరియల్: శారీరక వికాసం, ఆటల ద్వారా అభ్యసనానికి కావాల్సిన వస్తువులను సరఫరా చేశారు.

వర్క్ బుక్స్, మెటీరియల్ (75 రోజుల యాక్షన్ ప్లాన్)

గ్యారెంటీడ్ ఎఫ్.ఎల్.ఎన్. కోసం ప్రత్యేకంగా రూపొందించిన 75 రోజుల యాక్షన్ ప్లాన్ బుక్స్ అందించారు.

• స్థాయిల వారీ పుస్తకాలు: విద్యార్థుల స్థాయిని బట్టి స్ట్రీమ్ (Stream), మౌంటైన్ (Mountain), స్కై (Sky) అనే మూడు స్థాయిలలో విడివిడిగా యాక్టివిటీ షీట్లు, మెటీరియల్ ఇచ్చారు.
• ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్: 1 & 2 తరగతులకు ఒకటి, 3 నుండి 5 తరగతులకు మరొకటి చొప్పున టీచర్లకు గైడ్ బుక్స్ అందజేశారు.

డిజిటల్, సాంకేతిక పరికరాలు

• స్మార్ట్ టీవీలు & ఐఎఫ్‌పీ ప్యానెల్స్: తరగతి గదుల్లో ఆడియో-విజువల్ బోధన కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.
• క్యూఆర్ కోడ్‌లు: పాఠ్యపుస్తకాల్లో, ఎఫ్.ఎల్.ఎన్ మెటీరియల్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ల ద్వారా డిజిటల్ పాఠాలను చూసే వెసులుబాటు కల్పించారు.
• క్యూఆర్ఎఫ్ యాప్: విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, డేటాను రికార్డ్ చేయడానికి ఉపాధ్యాయులకు ఈ యాప్ అందుబాటులో ఉంది.
ఇవన్నీ విద్యార్థులు కేవలం బట్టీ పట్టకుండా, కృత్యాధార పద్ధతిలో భాషను, గణితాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. తద్వారా  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు  మౌఖిక భాషా అభివృద్ధి(ఓరల్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్), అక్షరాలను గుర్తించి చదవడం, ధారాళంగా చదవడం, అవగాహనతో చదవడం, రాత నైపుణ్యం, నంబర్ సెన్స్ & బేసిక్ ఆపరేషన్స్ (సంఖ్యా జ్ఞానం, మౌలిక గణితం వంటివి నేర్చుకోవడానికి సులభతరమవుతుంది.

టీచింగ్ ఎట్ రైట్ లెవల్ (టీఏఆర్ఎల్)

రాష్ట్రంలో ఉన్న అన్ని 3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం టీచింగ్ ఎట్ రైట్ లెవల్, కార్యక్రమం ద్వారా జీ-ఎఫ్ఎల్ఎన్ అనుసంధానంతో పిల్లల సామర్థ్యం మేరకే బోధన చేస్తున్నారు. మొత్తం ప్రాథమిక పాఠశాలలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్స్ అంద‌జేశారు.

9వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రాం

ప‌దో త‌ర‌గ‌తికి చేరే తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థుల కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా సెకండ‌రీ, హైస్కూళ్ల‌లో రెడీనెస్ ప్రోగ్రాం అమ‌లు చేస్తున్నారు. ప‌దో త‌ర‌గ‌తికి 9వ త‌ర‌గ‌తి నుంచే విద్యార్థుల‌ను సిద్ధం చేసే ఒత్తిడిలేని స్నేహ‌పూర్వ‌క విద్యాబోధ‌న‌తో రెడీనెస్ ప్రోగ్రాం రాష్ట్ర‌వ్యాప్తంగా అమ‌ల‌వుతోంది.

10వ త‌ర‌గ‌తికి 100 డేస్ యాక్ష‌న్ ప్లాన్‌

పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు  '100-రోజుల కార్యాచరణ ప్రణాళికను మంత్రి నారా లోకేశ్ అమలు చేశారు. 2025 డిసెంబర్ 6 నుంచి 2026 మార్చి 15 వరకు పకడ్బందీగా అమలు చేసిన ఈ ప్రణాళికలో, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ మార్కులను 'లీప్' మొబైల్ యాప్‌లో నమోదు చేసి, ప్రతిరోజూ 6 డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా విశ్లేషించారు. స్లిప్ టెస్టులలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని 'షైనింగ్ స్టార్స్', 'రైజింగ్ స్టార్స్'గా గుర్తించారు. వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యాశాఖ ప్రత్యేకంగా మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులను ఉచితంగా అందించింది. ముఖ్యంగా, నాన్-లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం ద్విభాషా (బై-లింగ్యువల్) పద్ధతిలో, ఒకవైపు తెలుగు మరోవైపు ఇంగ్లీషులో ప్రశ్నపత్రాలు రూపొందించి ఇవ్వడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. డ్యాష్‌బోర్డ్ విశ్లేషణ ద్వారా విద్యార్థుల బలాబలాలను అనుగుణంగా ప్రతి పాఠశాలకు 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలను పంపిణీ చేశారు. స్లిప్ టెస్టులలో వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా నిర్వహించి, వారిపై దృష్టి సారించారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు. పునాది దశ నుంచి సమస్యల మూలాలు తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు కృషి చేస్తూ, ప్ర‌భుత్వ విద్యార్థులకు కావాల్సిన బోధ‌న, బ‌డిలో సౌక‌ర్యాలు, నిపుణులైన ఉపాధ్యాయుల నియామ‌కం వంటి వాటిపై దృష్టి సారించారు. దీంతో స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయి.
Go Back to Shorts
Nara Lokesh
AP Education
Guaranteed FLN
GFLN
Andhra Pradesh schools
Education system

More Telugu News