ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించిన భువనేశ్వరి
- చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి
- ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ కుటుంబాలను కలిసి భరోసా కల్పించిన వైనం
- చంద్రబాబు జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉందని వ్యాఖ్య
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ‘‘పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు వారిని కలిసి భరోసా ఇవ్వడం మా బాధ్యత. అరెస్టును జీర్ణించుకోలేక కార్యకర్తలు చనిపోయారన్న విషయం తెలుసుకుని చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. ఆయన జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉంది. మా కుటుంబం కంటే కార్యకర్తలపైనే ఆయనకు ధ్యాస ఎక్కువ. ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ మృతి బాధాకరం. ప్రవీణ్ రెడ్డి చనిపోయిన రెండు రోజులకు బిడ్డ పుట్టాడని తెలిసింది. బిడ్డను చూసుకునే రాత ప్రవీణ్ రెడ్డికి లేదన్న విషయం చాలా బాధేసింది. కుమారుడిగా తల్లిదండ్రులకు ప్రవీణ్ రెడ్డి ఎలా అండగా ఉన్నారో... పార్టీ కూడా అంతే అండగా ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు. ప్రవీణ్ రెడ్డి, కనుమూరి చిన్నబ్బ కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.


