విశాఖలో నోట్లకట్టల కలకలం.. వాషింగ్ మెషిన్ లో బయటపడ్డ రూ.1.30 కోట్లు
- ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
- 30 మొబైల్ ఫోన్లు కూడా తరలిస్తున్న ఆటో డ్రైవర్
- డబ్బు, ఫోన్లు ఎవరివని ఆరా తీస్తున్న అధికారులు
వాషింగ్ మెషిన్లను విజయవాడకు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ వెల్లడించాడు. అయితే, నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం.