దేశంలోనే ప్రముఖ అవినీతి రాజకీయనేత సీఎం జగన్ అని జాతీయ మీడియా చెబుతోంది: కనకమేడల
- అవనిగడ్డ వచ్చిన కనకమేడల రవీంద్రకుమార్
- లంకమ్మ తల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న వైనం
- స్వచ్ఛమైన పాలన రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్న కనకమేడల
దేశంలోకెల్లా ప్రముఖ అవినీతి రాజకీయనేత ఎవరన్నా, అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరన్నా... జాతీయ మీడియా సీఎం జగన్ పేరే చెబుతోందని... అందుకే చంద్రబాబుపై బురద చల్లడానికి అక్రమ కేసుతో అరెస్ట్ చేయించారని కనకమేడల ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకువచ్చే ప్రతి స్కీము ఒక స్కాం అని విమర్శించారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం ఎటు వెళుతుందో చెప్పాలని నిలదీశారు.