Harish Rao: కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌రెడ్డి: మంత్రి హరీశ్ రావు

Harish rao serious comments on revanth reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... ఆనాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని నోటికి వచ్చినట్లు తిట్టిన టీపీసీసీ చీఫ్, ఇప్పుడు ఆమెనే దేవత అంటున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, తమది తెలంగాణ ప్రజల టీమ్ అన్నారు. మంగళవారం డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఓటుకు నోటు, నోటుకు సీటు అనే వాళ్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామని అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని నిలదీశారు.
Go Back to Shorts
Harish Rao
Revanth Reddy
BRS
Congress

More Telugu News