మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- అక్టోబర్ 21న భారీ శబ్దంతో కుంగిపోయిన పిల్లర్
- శబ్ధం రావడంతో కుట్రకోణం ఉందని అధికారుల అనుమానం
- మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు
అధికారుల ఫిర్యాదు నేపథ్యంలో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు రావడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టి సారించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగిన అంశంలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేయనున్నారు.