ప్రియుడి మోజులో పదిన్నర కేజీల బంగారం చోరీ చేసిన కంకిపాడు మణప్పురం బ్రాంచి మేనేజర్ పావని.. వలపన్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈ నెల 16న ఘటన
- మనస్పర్థల కారణంగా భర్తతో దూరంగా ఉంటున్న పావని
- ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడితో ప్రేమాయణం
- అతడి అప్పులు తీర్చడంతోపాటు విలాసవంతమైన జీవితం గడపాలని చోరీ
- శిరిడీలో అరెస్ట్ చేసి కంకిపాడు తీసుకొచ్చిన పోలీసులు
ఈ నెల 16న రాత్రి బ్యాంకుకు వెళ్లి 10.660 కేజీల బంగారు ఆభరణాలు చోరీ చేసి ఇంటికి వెళ్లింది. అక్కడ బ్యాగు, సెల్‌ఫోన్ పెట్టేసి చోరీచేసిన బంగారంలో కొంత తీసుకుని మిగతాది ప్రియుడికి అప్పగించింది. అదే సమయంలో తన బంధువులు శిరిడీ వెళ్తుంటే వారితో కలిసి వెళ్లింది.
మరోవైపు, అప్పటికే చోరీ విషయం వెలుగు చూసి కేసు నమోదు కావడంతో పోలీసులు పావనిపై నిఘాపెట్టారు. బంధువుల ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో పావని మాట్లాడుతుండడాన్ని పసిగట్టారు. ఆ వెంటనే బృందాలుగా ఏర్పడి శిరిడీ వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి కంకిపాడుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.