హెచ్-1బీ వీసాలో మార్పులు!.. భారతీయులపై పడనున్న ప్రభావం?
- విదేశీ కార్మికులు, విద్యార్థుల అర్హతలు క్రమబద్ధీకరణ
- మెరుగైన సౌకర్యాల కల్పన
- కీలక ప్రతిపాదనలు చేసిన బైడెన్ సర్కార్
అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారత్, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాలను మరింత పారదర్శకం చేసేందుకు బైడెన్ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
హెచ్-1బీ వీసాకు సంబంధించి తాజాగా చేసిన ప్రతిపాదనలు భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదనంగా డాక్యుమెంట్లు అందజేయాల్సి రావడం, భారతీయులకు వీసా జారీ విషయంలో మరింతగా వడపోత, పనిప్రదేశాన్ని తప్పనిసరిగా సందర్శించడం వంటి మార్పులు భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చూసేందుకు ఈ కొత్త ప్రతిపాదనలని అమెరికా చెబుతోంది.