తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు.. చత్తీస్‌గఢ్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బండి

Bandi Sanjay Star Campaigner In Chhattisgarh
  • చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం
  • మొత్తం 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసిన బీజేపీ
  • స్టార్‌క్యాంపెయినర్ల జాబితాలో మోదీ, అమిత్ షా, నడ్డా
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బండి సంజయ్‌ను ఖాళీగా ఉంచిన అధిష్ఠానం ఇప్పుడు ఆయనకు చత్తీస్‌గఢ్ సేవలు అప్పగించింది. చత్తీస్‌గఢ్‌కు త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బండిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. 

మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేయగా, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి బండి ఒకరికే చోటు దక్కడం గమనార్హం. బీజేపీ విడుదల చేసిన చత్తీస్‌గఢ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
Chhattisgarh
Chhattisgarh Elections
Star Campaigner

More Telugu News